Share News

అదాని కంపెనీ పోయే వరకు పోరాటం

ABN , Publish Date - May 03 , 2025 | 11:59 PM

అదాని కంపెనీ వెనక్కిపోయే వరకు పోరాడుతా మని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం తెలిపారు. ఆ కంపెనీ మారిక గ్రామానికి వస్తే సహించేదిలేదని హెచ్చరించారు.

అదాని కంపెనీ పోయే వరకు పోరాటం
అదానికంపెనీని తరిమికొడతామని హెచ్చరిస్తున్న గిరిజననాయకులు:

వేపాడ, మే 3 (ఆంధ్రజ్యోతి): అదాని కంపెనీ వెనక్కిపోయే వరకు పోరాడుతా మని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం తెలిపారు. ఆ కంపెనీ మారిక గ్రామానికి వస్తే సహించేదిలేదని హెచ్చరించారు. శనివారం మండలంలోని కరక వలస గ్రామ శివారు గిరిశిఖరగ్రామం మారికగ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక గిరిజనల బతు కులను గుజరాత్‌కు చెందిన ఓ అదానికి అప్పగించడం అన్యాయమన్నారు. ఇక్కడ అదానీ హైడ్రోపవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసిన నేపద్యంలో గ్రామాన్ని సందర్శించానన్నారు.అదానీ మారిక గ్రామానికి రాకు.. వస్తేబాణాలతో కొట్టి తరుముతామని తెలిపారు.కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, కరకవలస సర్పంచ్‌ పాతబోయిన పెంటమ్మ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, ప్రజా సంఘాల నాయకులు దాసరి వెంకన్న, జి.అప్పారావు,ఆనందు,రమణ,వీర్రాజు,బాబూరావు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:59 PM