Share News

Field duties are active క్షేత్రస్థాయి విధులే క్రియాశీలకం

ABN , Publish Date - May 17 , 2025 | 12:10 AM

Field duties are active నేర నియంత్రణకు క్షేత్రస్థాయిలో పనిచేసే దత్తత పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు (ఎంఎస్‌పీలు) కీలకంగా ఉండాలని ఎస్పీ వకుల్‌జిందాల్‌ అన్నారు. డెంకాడ పోలీసు స్టేషన్‌ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన భోగాపురం సర్కిల్‌ కార్యాలయాన్ని, సీఐ ఛాంబర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

Field duties are active క్షేత్రస్థాయి విధులే క్రియాశీలకం
పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌జిందాల్‌

క్షేత్రస్థాయి విధులే క్రియాశీలకం

దత్తత కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులతో ఎస్పీ వకుల్‌జిందాల్‌

డెంకాడ, మే 16(ఆంధ్రజ్యోతి): నేర నియంత్రణకు క్షేత్రస్థాయిలో పనిచేసే దత్తత పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు (ఎంఎస్‌పీలు) కీలకంగా ఉండాలని ఎస్పీ వకుల్‌జిందాల్‌ అన్నారు. డెంకాడ పోలీసు స్టేషన్‌ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన భోగాపురం సర్కిల్‌ కార్యాలయాన్ని, సీఐ ఛాంబర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు (ఎంఎస్‌పీలు), దత్తత పోలీసులతో ప్రత్యేకంగా మాట్లాడారు. నేర నియంత్రణ, సమాచార సేకరణ, నిఘా ఏర్పాటు చేయడంలో క్షేత్రస్థాయిలో మహిళా పోలీసుల, దత్తత పోలీసులు నిర్వహించే విధులే క్రియాశీలకమన్నారు. మహిళా పోలీసులు నిర్వహించే విధులను పర్యవేక్షించేందుకు ఇటీవలే ప్రత్యేకంగా వెట్‌సైట్‌ను ప్రారంభించామన్నారు. ఎంఎస్‌పీలు తమ పరిధిలో ఉన్న గ్రామాల్లో నిఘా పెట్టాలని, కొత్తగా వచ్చే వ్యక్తుల గురించి, ఒంటరి మహిళలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. ఎంఎస్‌పీల పనితీరును ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తామని, ప్రతీ మాసం పర్యవేక్షించి ఉత్తమంగా సేవలందించే వారిని ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం భోగాపురం సర్కిల్‌ పరిధిలోని పోలీసు సిబ్బందితోనూ మమేకమయ్యారు. ఈ-బిట్స్‌ను సమర్థంగా అమలు చేయాలని, దత్తత గ్రామాలను విధిగా సందర్శించాలని, గ్రామంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత ఎస్‌హెచ్‌వోకు అందించాలన్నారు. కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం రూరల్‌ సీఐ జి.రామకృష్ణ, సీఐలు ఏవీ లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, డెంకాడ ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:10 AM