Share News

Fevers జ్వరాలు తగ్గలే!

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:35 PM

Fevers Show No Sign of Easing! సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వైరల్‌ ఫీవర్లు ప్రజలను పట్టీపీడిస్తున్నాయి. సీతంపేట ఏరియా ఆసుపత్రి సోమవారం జ్వరపీడితులతో కిక్కిరిసింది. 320 వరకు ఓపీ నమోదైంది.

Fevers జ్వరాలు తగ్గలే!
ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు

  • ఏరియా ఆసుపత్రిలో ఓపీ సంఖ్య 320

సీతంపేట రూరల్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వైరల్‌ ఫీవర్లు ప్రజలను పట్టీపీడిస్తున్నాయి. సీతంపేట ఏరియా ఆసుపత్రి సోమవారం జ్వరపీడితులతో కిక్కిరిసింది. 320 వరకు ఓపీ నమోదైంది. వారిలో 100 మంది వరకు టైఫాయిడ్‌, విష జ్వరాల బాధితులు ఉన్నారు. ఆర్‌డీటీ రక్త పరీక్షల్లో 16 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదవగా, స్లైడ్‌ పరీక్షలో ఒక కేసు పాజిటివ్‌ వచ్చింది. వారిలో 37 మంది వరకు ఏరియా ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతున్నారు. అయితే రోగులకు వసతి సమస్య వేధిస్తోంది. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు వివరణ కోరగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Jul 28 , 2025 | 11:35 PM