Fevers జ్వరాలు తగ్గట్లే..
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:16 AM
Fevers Show No Sign of Decline : సీతంపేట మన్యంలో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఏజెన్సీలో రోజురోజుకూ జ్వరపీడితులు పెరుగుతూనే ఉన్నారు. తీవ్ర జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో రోగులు సీతంపేట ఏరియా ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.
సీతంపేట రూరల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఏజెన్సీలో రోజురోజుకూ జ్వరపీడితులు పెరుగుతూనే ఉన్నారు. తీవ్ర జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో రోగులు సీతంపేట ఏరియా ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సోమవారం ఏరియా ఆసుపత్రిలో 365 వరకు ఓపీ నమోదైంది. వారిలో 101మంది జ్వరంతో బాధపడుతుండగా, 46 మంది ఇన్‌పేషేంట్లుగా చేరారు. ఒక మలేరియా పాజిటివ్ కేసు నమోదైంది. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు తెలిపారు.