Share News

Fevers: నులకజోడులో జ్వరాలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:39 PM

Fevers: మండలంలోని నులకజోడు దళిత వీధిలో ఇంటింటా జ్వరాలు సోకడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

 Fevers: నులకజోడులో జ్వరాలు
నులకజోడులో జ్వర పీడితుల నుంచి రక్తపూతలు స్వీకరిస్తున్న వైద్య సిబ్బంది

- బత్తిలి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న పీడితులు

- రక్తపూతలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

- పారిశుధ్య లోపమే కారణం

భామిని, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నులకజోడు దళిత వీధిలో ఇంటింటా జ్వరాలు సోకడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా పలువురు జ్వరాలతో పాటు కాళ్లు చేతుల నొప్పులతో బాధపడుతున్నారు. గురువారం బత్తిలి వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో వైద్యాధికారి దామోదర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామానికి చేరుకుని ఇంటింటా సందర్శించి జ్వర పీడితుల నుంచి రక్తపూతలను స్వీకరించారు. జ్వరంతో బాధపడుతున్న జి.సుహాసిని, ఫల్గుణరావు, సీహెచ్‌.నూకరాజు, కళ్యాణి, ఎం.సాయమ్మ, ఎన్‌.సంజీవరావుతో పాటు మరో నలుగురిని బత్తిలి పీహెచ్‌సీకి తరలించారు. వీరికి మలేరియా, డెంగ్యూ, టైపాయిడ్‌ పరీక్షలు చేశారు. సెలైన్లు అందించారు. ఇవి సీజనల్‌ జ్వరాలేనని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యాధికారి తెలిపారు. గ్రామంలో పారిశుధ్యం లోపించడం వల్లనే జ్వరాలు ప్రబలినట్లు చెప్పారు. మరో మూడు రోజులు వరకు ఇంటింటా జ్వర పీడితులను గుర్తించి మందులు అందిస్తామని తెలిపారు.

Updated Date - Apr 10 , 2025 | 11:39 PM