పనసవలసలో జ్వరాలు
ABN , Publish Date - May 09 , 2025 | 12:13 AM
సాలూరు మండలం కొఠియా గ్రూప్ పట్టుచెన్నారు పంచాయతీ పనసవలసలో జ్వరాలు ప్రబలాయి. చలితో కూడిన జ్వరాలు కావడంతో మలేరియా లక్షణాలుగా అనుమానించి గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
సాలూరు రూరల్, మే 8(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం కొఠియా గ్రూప్ పట్టుచెన్నారు పంచాయతీ పనసవలసలో జ్వరాలు ప్రబలాయి. చలితో కూడిన జ్వరాలు కావడంతో మలేరియా లక్షణాలుగా అనుమానించి గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తోణాం పీహెచ్‌సీ వైద్యాధికారి అక్యాన అజయ్ గురువారం వైద్యసిబ్బందిని అక్కడికి పంపించారు. సిబ్బంది 48 మంది నుంచి రక్తపూతలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇరువురికి మలేరియా లక్షణాలున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. మరో ఆరుగురికి జ్వరాలుండడంతో మందులు ఇచ్చారు.