Share News

Tribal Students గిరిజన విద్యార్థులకు జ్వరాలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:27 AM

Fevers Among Tribal Students కురుకూటి, తోణాం గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతూ.. బుధవారం తోణాం పీహెచ్‌సీలో చేరారు.

  Tribal Students  గిరిజన విద్యార్థులకు జ్వరాలు
తోణాం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న కురుకూటి ఆశ్రమ పాఠశాల బాలికలు

సాలూరు రూరల్‌, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): కురుకూటి, తోణాం గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతూ.. బుధవారం తోణాం పీహెచ్‌సీలో చేరారు. కురుకూటి గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలకు చెందిన 3,8,9 తరగతుల విద్యార్థినులు గెమ్మెల కుసుమ, మర్రి రాధ, సీదరపు స్నేహ అక్కడ చికిత్స పొందుతున్నారు. తోణాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన 5,6,10 తరగతుల విద్యార్థులు మర్రి జాంబ్రి, సీదరపు నవదీప్‌, జన్ని వరుణ్‌, గూడూరు రాము, మంచాల హేమంత్‌, పింగళి సింహాద్రిని ఉపాధ్యా యులు తోణాం పీహెచ్‌సీలో చేర్పించారు. డాక్టర్‌ చైతన్య వైద్య తనిఖీలు చేశారు. వారికి రక్తపరీక్షలు చేయించి.. జ్వరం నివారణకు చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:27 AM