Share News

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:03 AM

పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు శాపంగా మారినా జీవో నెం.77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 2022-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. సంఘ నాయకులు సుమన్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:03 AM