ఎరువులకోసం తరలివచ్చిన అన్నదాతలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:33 AM
మండలంలో పెదబోరబంద రైతు సేవా కేంద్రానికి ఎరువులు వచ్చాయని తెలియడంతో సోమవారం పరిసర గ్రామాల రైతులు తరలివచ్చారు. పెదబోరబంద రైతుసేవా కేంద్రానికి 267 బస్తాల యూరియా వచ్చింది.
సాలూరు రూరల్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి ): మండలంలో పెదబోరబంద రైతు సేవా కేంద్రానికి ఎరువులు వచ్చాయని తెలియడంతో సోమవారం పరిసర గ్రామాల రైతులు తరలివచ్చారు. పెదబోరబంద రైతుసేవా కేంద్రానికి 267 బస్తాల యూరియా వచ్చింది. ఈవిషయం తెలియడంతో వర్షం కురుస్తున్నా గొడుగులు వేసుకుని చేరుకున్నారు. పెద్దసంఖ్యలో రైతులు చేరుకోవడంతో గ్రామ సచివాలయ సిబ్బంది పంపిణీకి పోలీసుల సాయం కోరారు. సాలూరు రూరల్ ఎస్‌ఐ నర్సింహ మూర్తి సిబ్బందితో వచ్చి బందోబస్తు నిర్వహించారు. తొలుత రైతులకు టోకెన్లు జారీ చేసి అనంతరం యూరియా అందించారు. అయితే పలువురు రైతులకు యూ రియా అందలేదు. దీంతో వారు వాగ్వాదానికి దిగారు. వారికి రూరల్ ఎస్.ఐ నర్సిం హామూర్తి నచ్చజెప్పి పంపించారు.
ఫ సీతానగరం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదభోగిలి సొసైటీలో తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఏవో ఎస్.అవినాష్ ఆధ్వర్యంలో పోలీస్‌శాఖ సమక్షం లో యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వెం కటాపురం రైతుసేవా కేంద్రం, రామవరం, మరిపివలస, వెంకటేశ్వర ఫెర్టిలైజర్‌లో, కొత్తవలస సొసైటీలో 12 మెట్రిక్ టన్నులు చొప్పున ఎరువులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతుసేవా కేంద్రాలకు 562 మెట్రిక్ టన్నులు, డీలర్లకు 158 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని చెప్పారు.