రైతులను మోసం చేశారు
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:10 AM
స్థానిక రామనారాయణ ఏజెన్సీ తమను మోసం చేసిందని గడిముడిదాం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజాం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక రామనారాయణ ఏజెన్సీ తమను మోసం చేసిందని గడిముడిదాం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రామనారాయణ ఏజెన్సీ వద్ద గడిముడిదాం, అమరాం, దోసరి, రామినాయుడువలస గ్రామాలకు చెందిన 150 మంది రైతులు ఎంటీ యూ 1001 వరి విత్తనాలు కొనుగోలు చేయడానికి వెళ్తే.. గంగోత్రి విత్తనాలు ఇచ్చారు. దీనిపై పలువురు రైతులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డాట్‌సెంటర్ కోఆర్డినేటర్ లక్ష్మణరావు, శాస్త్రవేత్తలు ఉదయభా ను, మధుబాబు గురువారం ఆ పంటలను పరిశీలించారు. రైతులకు అన్యాయం జరిగినట్టు తమ పరిశీలనలో తేలిందని వారు చెప్పారు. రైతుల వివరాలతో పాటు నష్టం జరిగిన విషయంపై కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఏడీ కె.చంద్రరావు, ఏవో చీకటి రఘునాథ్ పాల్గొన్నారు.