Share News

రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:48 PM

కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. మంగళవారం జిల్లాలో పలు చోట్ల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్నా-మీకోసం వారోత్సవాలను అధికారులు, కూటమి నాయకులు నిర్వహించారు.

రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
విజయనగరం రూరల్‌: సీఎం చంద్రబాబు రైతులకు రాసిన లేఖను అందజేస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు:

కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. మంగళవారం జిల్లాలో పలు చోట్ల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్నా-మీకోసం వారోత్సవాలను అధికారులు, కూటమి నాయకులు నిర్వహించారు.

ఫడెంకాడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆధునిక వ్యవసాయ పద్ధతు లు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. మండలంలోని పెదతాడివాడలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్నా-మీకోసం వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు కంది చంద్రశేఖరరావు, ఎంపీపీ బంటుపల్లి వాసు దేవరావు, భాస్కరరావు, ఏవో టి.సంగీత, ఏఈవో రామకోటి పాల్గొన్నారు.

ఫవంగర, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):రైతులకోసం ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పఽథకాలు ప్రవేశ పెట్టి ఆదుకుంటుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. కింజంగిలో నిర్వహించిన రైతన్నా- మీకోసం కార్యక్రమంలో కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొత్స వాసుదే వరావు, పైల వెంకటరమణ, ఎల్‌.కృష్టమూర్తి, ధనలక్ష్మి, మోహన్‌రావు, దుర్గారావు, రమేష్‌ పాల్గొన్నారు.

ఫవిజయనగరం రూరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. మంగళవారం గొల్లలపేటలోని రైతన్నా-మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులకు సీఎం చంద్రబాబు రాసినలేఖలను అందజేశారు. ధాన్యం కొను గోళ్లపై రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఫగుర్ల, నవంబరు25(ఆంధ్రజ్యోతి):రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభు త్వం పాటుపడుతోందని టీడీపీ రాష్ట్రకార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయు డు తెలిపారు. మండలంలోని పాలవలస, గూడెం గ్రామాల్లో రైతన్నా- మీకోసం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్‌ కార్యద ర్శి వి.సన్యాసినాయుడు, సొసైటీ అధ్యక్షులు కిరణ్‌కుమార్‌రాజు, బీసీ సెల్‌ నాయకులు మండల అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:48 PM