Farmers రైతులు జాగ్రత్తలు పాటించాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:21 AM
Farmers Should Take Precautions మొంథా తుఫాన్ తర్వాత ఖరీఫ్ వరి రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్ పాల్ తెలిపారు.
బెలగాం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ తర్వాత ఖరీఫ్ వరి రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్ పాల్ తెలిపారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘పొలంలో నీరు నిలిచి ఉంటే వెంటనే తొలగించాలి. గింజలు రంగు మారకుండా, మాగుడు, మానిపండు తెగుళ్ల నివారణకు ఎకరాకు 200 మిల్లీలీటర్ల చొప్పున ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలి. మొలకలు కనబడితే 5శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల స్పటిక ఉప్పు) స్ర్పే చేయాలి. ఎండాకు తెగులు ఆశిస్తే.. ప్లాంటోమైసిస్ 1 మిల్లీ లీటర్, కాపర్ ఆక్సి క్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నీరు తగ్గిన తర్వాత హెక్సకొనజోల్ 2 మిల్లీ లీటర్లు లీటర్ నీటిలో కలిపి స్ర్పే చేయాలి.’ అని వెల్లడించారు.