Farmers should grow economically. రైతులు ఆర్థికంగా ఎదగాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:20 PM
Farmers should grow economically. రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో నెల ముందుగానే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.
రైతులు ఆర్థికంగా ఎదగాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్
గజపతినగరం, నవంబరు16(ఆంధ్రజ్యోతి): రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో నెల ముందుగానే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. జిల్లావ్యాప్తంగా 5లక్షల 80వేల మెట్రిక్ టన్నుల వరి పంటసాగుచేయగా ఈఏడాది ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం సాధారణ రకానికి రూ.2,369, గ్రేడ్ ఏ రకం వద్ద రూ.2,389 చెల్లిస్తుందన్నారు. గన్నీలకు సంబంధించి గతంలో రూ.3.90పైసలు ఇవ్వగా ఈఏడాది 4.75పైసలు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే వాహన రవాణా ఖర్చులు నేరుగా రైతులఖాతాలో జమ చేస్తామన్నారు. రైతులు మిల్లులకు ధాన్యం తరలించిన 48 గంటల్లో వారిఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుందని గత ఏడాది చెప్పి గంటల వ్యవధిలోనే చెల్లించిందని, అదే విధంగా ఈఏడాది కూడా నగదు జమ చేస్తుందన్నారు.
- కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలను సోషల్ మీడియా ద్వారా చేస్తోందని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకం త గ్గించాలని సూచించడంతో యూరియా రావడానికి కొంత సమయం పట్టిందని, దీనికి ప్రతిపక్ష నేతలు రాష్ట్రమంతా అల్లర్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్‌వో మురళీధర్, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, పౌరసరఫరాలశాఖ డీఎం శాంతి, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, మాజీ మంత్రి జనసేన నాయకులు పడాల అరుణ తదితరులు పాల్గొన్నారు.