రైతులకు సహకరించాలి: విప్
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:18 PM
పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు సహకరించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కోరారు. ఆదివారం చినమేరంగి, బీజేపురం పీఏసీఎస్‌ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు.చినమేరంగి పీఏసీఎస్ చైర్మన్‌గా రెడ్డి బలరామ స్వామినాయుడు, మరో ఇద్దరు కమిటీ సభ్యులు, బీజేపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి సోములు మాస్టారుతోపాటు కమిటీసభ్యులతో ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు.
జియ్యమ్మవలస, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు సహకరించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కోరారు. ఆదివారం చినమేరంగి, బీజేపురం పీఏసీఎస్‌ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు.చినమేరంగి పీఏసీఎస్ చైర్మన్‌గా రెడ్డి బలరామ స్వామినాయుడు, మరో ఇద్దరు కమిటీ సభ్యులు, బీజేపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి సోములు మాస్టారుతోపాటు కమిటీసభ్యులతో ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ బొంగు సురేష్, అరకు పార్లమెంట్ నియోజక వర్గ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, వట్టిగెడ్డ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సత్యంనాయుడు, టీడీపీ మండలాధ్యక్షుడు జోగి భుజంగరావు, పీఏసీఎస్ సీఈవోలు సామల పోలిరాజు, తిరుపతిరావు పాల్గొన్నారు.