Share News

రైతులకు మెరుగైన సేవలందించాలి

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:51 PM

పీఏసీఎస్‌ల పరిధిలోని రైతులకు మెరుగైన సేవలందించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి కోరారు.

  రైతులకు మెరుగైన సేవలందించాలి
పర్సన్‌ఇన్‌చార్జి, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న జగదీశ్వరి :

గరుగుబిల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పీఏసీఎస్‌ల పరిధిలోని రైతులకు మెరుగైన సేవలందించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి కోరారు. బుధవారం గరుగుబిల్లిలో పీఏసీఎస్‌ పర్సన్‌ఇన్‌చార్జిగా పి.పూర్ణచంద్రరావు, డైరెక్టర్లగా కె.అరుణ్‌కుమార్‌, బి.రామారావు ప్రమాణ స్వీ కారంచేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌చంద్ర దేవ్‌, కొప్పల వెలమసంక్షేమ డైరెక్టర్లు ఎ.మధుసూదనరావు, జి.వెంకటనా యుడు,నాయకులు ఎం.పురుషోత్తంనాయుడు, ఎంబీ విజయవాంకుశం, ఎం. తిరుపతినాయుడు, సత్యనారాయణ, రాంబాబు, నారాయణస్వామి, సీఈవో రవికుమార్‌, శివకుమార్‌, పొట్నూరు వెంకటనాయుడు,గౌరమ్మ పాల్గొన్నారు.

కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం

టీడీపీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయమని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌చంద్రదేవ్‌ తెలిపారు. ఉద్దవోలు సర్పం చ్‌ వావిలాపల్లి భూదేవి, దివాకర్‌ కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల సర్పంచ్‌ కుమారుడు మృతి చెందిన విషయం విదితమే.

Updated Date - Aug 20 , 2025 | 11:51 PM