Share News

రైతుల ఆదాయం రెట్టింపు కావాలి

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:54 PM

రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి సెంచూరియన్‌ విశ్వ విద్యాలయం దోహదపడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు.

 రైతుల ఆదాయం రెట్టింపు కావాలి
రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

-వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాలి

- మంత్రి కొండపల్లి

నెల్లిమర్ల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి సెంచూరియన్‌ విశ్వ విద్యాలయం దోహదపడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. శనివారం సెంచూరియన్‌ విశ్వవి ద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండో రైతు సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. వ్యవసాయం లాభసాటిగా మారేందుకు అవసర మైన పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలన్నారు. వ్యవసా య అనుబంధ పరిశ్రమలైన పందుల పెంపకం వంటి వాటి ద్వారా కూడా రైతులు ఆదాయం పొందవచ్చునని అన్నారు. రైతులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని కోరారు. యూనివర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ డీఎన్‌.రావు మాట్లాడుతూ.. మట్టి లేకుండా వ్యవసాయం, గాలితో పంటలు పండించడం చేయవచ్చని తెలిపారు. వీటిని పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపట్టామన్నారు. ఏడాదికి రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆదాయం పొందవ చ్చునని వివరించారు. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల నియోజ కవర్గాల్లో గ్రామా లను దత్తత తీసుకొని నూతన పద్ధతులను అక్కడ రైతులకు వివరిస్తామని అన్నారు. విజయన గరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ.. ఇక్కడ విశ్వవిద్యా లయం ఏర్పాటు చేసిన నాలుగేళ్లలోనే మంచి కోర్సు లను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులకు ఉపయోగపడేలా ఇటువంటి కార్య క్రమాలు చేపట్టడం అభినందనీయ మన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించా రు. సీటి స్కాన్‌, మోడల్‌ ల్యాబ్‌, సైబర్‌ ఫారెన్సిక్‌ ల్యాబ్‌తో పాటు మరో రెండు ల్యాబ్‌లను మంత్రి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, అదితి ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన నేత లోకం ప్రసాద్‌, వర్సిటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌. రాజు, వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ మహంతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 11:54 PM