జీరో టిల్లేజ్‌పై రైతులకు అవగాహన
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:32 AM
జీరో టిల్లేజ్ పద్ధతిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి రెడ్డి అన్నపూర్ణ అన్నారు.
సీతానగరం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జీరో టిల్లేజ్ పద్ధతిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి రెడ్డి అన్నపూర్ణ అన్నారు. మంగళవారం చినభోగిలిలో మొక్కజొన్న జీరో టిల్లేజ్ సాగు చేస్తున్న రైతుల పంట పొలా లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి కోసిన తరువాత పొలంలో వరి మొదళ్లు ఉండగానే దుక్కి దున్నకుండా చదను చేసుకుని మొక్కజొన్న విత్తనాలను చల్లాలన్నారు. ఈ పద్ధతిలో సాగు చేస్తే అధిక దిగుబడి సాధించే అవకాశం ఉందన్నారు. ఈ పంట ఆహార పంటగానే కాకుండా పశువులకు మేత, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా ఉపయోగ పడుతుందన్నారు. రబీలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేస్తే మేలన్నారు. ఆమెతో పాటు మండల వ్యవసాయాధికారి ఎస్.అవినాష్, సిబ్బంది పాల్గొన్నారు.