Farmer Welfare రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:07 AM
Farmer Welfare Is Our Prime Goal రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘రైతన్నా... మీ కోసం’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ రైతన్నా...మీ కోసం’ పై విస్త్రత ప్రచారం చేయాలన్నారు.
బెలగాం, నవంబరు24(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘రైతన్నా... మీ కోసం’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ రైతన్నా...మీ కోసం’ పై విస్త్రత ప్రచారం చేయాలన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. బహుళ పంటలు సాగు చేసేలా చూడాలన్నారు.
పరిశుభ్రత, మౌలిక వసతులపై నివేదిక
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసి పరిశుభ్రత, మౌలిక వసతులపై నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. కార్యాలయ ప్రాంగణాలు, పరిసరాలు, మరుగుదొడ్లును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. పనికిరాని వస్తువులను వెంటనే డిస్పోజ్ చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల కోసం మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. వాటి ఫొటోలు, వీడియోలను తీసి తక్షణమే జిల్లా అధికారుల ప్రత్యేక గ్రూపులో పెట్టాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.