పిడుగు పాటుతో రైతు మృతి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:53 PM
పిడుగు పాటుతో రైతు మృతిచెందిన ఘటన మండలంలోని రెడ్డిపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
రేగిడి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): పిడుగు పాటుతో రైతు మృతిచెందిన ఘటన మండలంలోని రెడ్డిపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డిపేటకు చెందిన కొవగాన నాయుడు(45) అనే రైతు గ్రామ సమీపంలో జొన్నపిక్కలు ఎండబెట్టాడు. శనివారం చిన్నపాటి వర్షం పడడంతో జొన్నపిక్కలు కుప్పపెట్టేందుకు తోటి రైతు నడిపల్లి ధనంజయ్‌తో వెళ్లాడు. కుప్పపెట్టిన అనంతరం ఎవరి దారిలో వారు వెళ్తుండగా ఒక్కసారిగా భీకర శబ్ధంతో పిడుగు పడింది. దీంతో నాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మృతిచెందా డు. పిడుగు పడిన ప్రాంతానికి ధనంజయ్ కొద్దిదూరంలో ఉండడంతో ప్రాణా పాయం తప్పింది. నాయుడు వ్యవసాయంతో పాటు ఆటో కూడా నడుపుతుం టాడు. ఈయనకు భార్య సుగుణ, పిల్లలు రాధిక, లావణ్య ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. పంచాయతీ కార్యదర్శి గోపాల్‌నాయుడు పిడుగుపాటు సమాచారాన్ని రేగిడి పోలీస్‌స్టేషన్, రెవెన్యూ వర్గాలకు అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం తరలించారు. రేగిడి పోలీసులు కేసు నమోదు చేశారు.