Farmer die after being struck by lightning పిడుగుపడి రైతు మృతి
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:12 AM
Farmer die after being struck by lightning పొలం పనిచేస్తున్న అన్నదాతను మృత్యువు పిడుగుపాటు రూపంలో కబళించిన ఘటనిది. జాడపేట( వెంకటరంగరాయపురం) గ్రామంలో బుధవారం మధ్నాహ్నం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన రైతు అలబోయిన శ్రీను(47) మృతిచెందగా, మరో ముగ్గురు రైతులు అస్వస్థతకు గురయ్యారు.
పిడుగుపడి రైతు మృతి
జాడపేటలో నాట్లు వేస్తుండగా ఘటన
మరో ముగ్గురికి అస్వస్థత
రేగిడి, జూలై 23(ఆంధ్ర జ్యోతి): పొలం పనిచేస్తున్న అన్నదాతను మృత్యువు పిడుగుపాటు రూపంలో కబళించిన ఘటనిది. జాడపేట( వెంకటరంగరాయపురం) గ్రామంలో బుధవారం మధ్నాహ్నం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన రైతు అలబోయిన శ్రీను(47) మృతిచెందగా, మరో ముగ్గురు రైతులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జాడపేటకు చెందిన అలబోయిన శ్రీను గ్రామానికి కూతవేటు దూరంలోని తన వ్యవసాయ పొలంలో వరినాట్లు వేసేందుకు బుధవారం వెళ్లాడు. గ్రామానికి చెందిన తోటి రైతులు, కుమా రుడు గంగరాజుతో పనులు చేపట్టాడు. భోజన సమయం అయ్యాక అందరూ పొలం బయటకు వచ్చేశారు. శ్రీను, మరో ముగ్గురు రైతులు మాత్రం నాట్లు సర్దేందుకు మళ్లీ పొలంలోకి వెళ్లారు. ఆ సమయంలోనే భారీ వర్షం కురిసింది. పెద్ద శబ్ధం చేస్తూ శ్రీనుకు సమీపంలో పిడుగు పడింది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోగా లుకలాపు రామినాయుడు, పాండ్రంకి బంగారి, పులవిందుల అదినారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీరికి గ్రామస్థులు సపర్యలు చేయడంతో కొద్దిక్షణాల్లో తేరుకొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనును 108లో కుటుంబీకులు రాజాం ప్రాంతీయ అసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
- శ్రీను సన్నకారు రైతు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. భార్య నీలమ్మతో పాటు కొడుకులు గంగరాజు, వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్‌కు ఇంకా పెళ్లికాలేదు. కుటుంబానికి శ్రీనే అధారం కాగా పొలం పనికి వెళ్లి మృతిచెందడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
------------