ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:56 PM
స్థానిక బైపాస్ రోడ్డులో గల బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చోరీకి ప్రయత్నించా రు.బ్యాంకు ఆఫ్ బరోడా పక్కనే ఆనుకుని ఏటీఎం ఏర్పాటు చేశారు.
పాచిపెంట, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక బైపాస్ రోడ్డులో గల బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చోరీకి ప్రయత్నించా రు.బ్యాంకు ఆఫ్ బరోడా పక్కనే ఆనుకుని ఏటీఎం ఏర్పాటు చేశారు. ముందుగా సీసీ కెమెరాలను దొంగిలించి ఏటీఎం చోరీకి యత్నించగా, ఏటీఎం కొద్ది భాగం ధ్వంసమయ్యింది. ఈ మేరకు బ్యాంకు మేనేజరు ఎల్.దేవిగణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కె.వెంకటసురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.