‘పది’ పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:00 AM
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ డీఈవో కె.వెంకటరమణమూర్తి ఆదేశించారు. మడ్డువలస గురుకులం, వంగర, సీతారాంపురంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను శనివారం పరిశీలించారు.
వంగర, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ డీఈవో కె.వెంకటరమణమూర్తి ఆదేశించారు. మడ్డువలస గురుకులం, వంగర, సీతారాంపురంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను శనివారం పరిశీలించారు. పరీక్షలకు వందల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతారని, అందుకు అనుగుణంగా సిబ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు.
పాఠశాలను సందర్శించిన ఎంఈవో
వేపాడ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జాకేరు ప్రాథమిక పాఠ శాలను ఎంఈవో పి.బాలభాస్కరరావు శనివారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, కిచచెన్ గార్డెన్, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించాని సూచించారు.