Share News

Facilities for those 36 villages ఆ 36 గ్రామాలకు సౌకర్యాలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:56 PM

Facilities for those 36 villages జిల్లా విడిపోయిన తరువాత ఐటీడీఏ కూడా మన జిల్లా నుంచి వేరైందని, దీనివల్ల ఏమేమి కోల్పోయారో వాటన్నింటినీ జిల్లాలో ఉన్న 36 గ్రామాలకు సమకూర్చుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది.

Facilities for those 36 villages ఆ 36 గ్రామాలకు సౌకర్యాలు
మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ఆ 36 గ్రామాలకు సౌకర్యాలు

రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు

ఆదివాసీ దినోత్సవ సభలో మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా విడిపోయిన తరువాత ఐటీడీఏ కూడా మన జిల్లా నుంచి వేరైందని, దీనివల్ల ఏమేమి కోల్పోయారో వాటన్నింటినీ జిల్లాలో ఉన్న 36 గ్రామాలకు సమకూర్చుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఇప్పటికే పంపించామన్నారు. ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమీక్షలు జరిపి గిరిజన సమస్యలు తెలుసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారికి మంత్రి సూచించారు. అనంతరం జేసీ సేతు మాధవన్‌ మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. గిరిజనుల నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు రావాలని, అప్పుడే వారు అర్థికంగా అభివృద్ధి చెందగలరని తెలిపారు. గిరిజన కళలను, వారసత్వ సంపదను, సంస్కృతిని ముందుకు తీసుకు వెళ్లాలని, అందుకోసం అందరం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో డీఆర్‌వో శ్రీనివాస్‌మూర్తి, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 11:56 PM