Bar Applications బార్ల దరఖాస్తు గడువు పెంపు
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:21 PM
Extension of Deadline for Bar Applications రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బార్ పాలసీ 2025-28 దరఖాస్తు గడువును ఈ నెల 29 వరకూ పొడిగించినట్టు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరిడెంట్‌ంట్ బి.శ్రీనాథుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బార్ పాలసీ 2025-28 దరఖాస్తు గడువును ఈ నెల 29 వరకూ పొడిగించినట్టు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరిడెంట్‌ంట్ బి.శ్రీనాథుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న ఓపెన్ కేటగిరీ, గీత కార్మికులకు సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో బార్లు కేటాయిస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో 27, పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు.