Share News

Exploded electric scooter battery పేలిన ఎలక్ర్టికల్‌ స్కూటీ బ్యాటరీ

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:13 AM

Exploded electric scooter battery బొబ్బిలి పట్టణ పరిధిలోని సిరిపురపువీధిలో వంతరాం రోడ్డు పక్కన పక్కి రమేష్‌కు చెందిన ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ బ్యాటరీ సోమవారం మధ్యాహ్నం పేలిపోయింది. ఘటనలో స్కూటర్‌ వెనుకభాగమంతా పూర్తిగా కాలిపోయింది.

Exploded electric scooter battery పేలిన ఎలక్ర్టికల్‌ స్కూటీ బ్యాటరీ
కాలిపోయిన బైకులు

పేలిన ఎలక్ర్టికల్‌ స్కూటీ బ్యాటరీ

రెండు స్కూటీలకు నష్టం

ఎండలో ఉంచడమే కారణమా?

బొబ్బిలి, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి పట్టణ పరిధిలోని సిరిపురపువీధిలో వంతరాం రోడ్డు పక్కన పక్కి రమేష్‌కు చెందిన ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ బ్యాటరీ సోమవారం మధ్యాహ్నం పేలిపోయింది. ఘటనలో స్కూటర్‌ వెనుకభాగమంతా పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వాహనానికి కూడా మంటలు వ్యాపించాయి. పేలిన శబ్ధం, మంటలను గమనించిన వెంటనే రమేష్‌ పరుగున ఇంట్లో నుంచి బయటకు వచ్చి పైపులైన్‌తో మంటలు అదుపు చేశారు. ఎండ చాలా తీవ్రంగా ఉండడం, మధ్యాహ్న భోజనాల సమయం కావడంతో రోడ్డుపై జనసంచారం కూడా కాస్త తక్కువగా ఉంది. దీంతో పెద్ద అపాయం తప్పినట్లయింది. నాలుగేళ్లుగా తాను ఈ విద్యుత్‌ ద్విచక్రవాహనాన్ని వినియోగిస్తున్నట్లు యజమాని పక్కి రమేష్‌ తెలిపాడు. గతంలో బొబ్బిలి పట్టణంలో బ్యాటరీ చార్జింగ్‌ చేస్తుండగా ఇంట్లో ఓ విద్యుత్‌ స్కూటర్‌ పేలిపోయిందని, అప్పటి నుంచి ఈ స్కూటర్‌ను ఆరుబయటే ఉంచుతున్నానన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎటువంటి చార్జింగ్‌ పెట్టలేదని, ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా ఇలా జరిగి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు.

Updated Date - Jul 15 , 2025 | 12:13 AM