Share News

Eligible Beneficiaries అర్హుల జాబితాపై కసరత్తు

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:44 PM

Exercise on the List of Eligible Beneficiaries అర్హులైన ప్రతి రైతు కుటుంబానికీ అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాగానికి తగిన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం వనమిత్ర యాప్‌ను కూడా రూపొందించింది. కాగా జిల్లాలో అర్హుల జాబితా తయారీపై వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.

 Eligible Beneficiaries అర్హుల జాబితాపై కసరత్తు

  • త్వరలోనే ఆర్థిక సాయం జమ

సాలూరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి రైతు కుటుంబానికీ అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాగానికి తగిన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం వనమిత్ర యాప్‌ను కూడా రూపొందించింది. కాగా జిల్లాలో అర్హుల జాబితా తయారీపై వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు రైతు భరోసా సాయం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు అధికారులు పకడ్బందీగా జాబితాను తయారు చేస్తున్నారు. ఒకటికి రెండు సార్లు రైతుల పేర్లు సరిచూసుకుంటున్నారు. అర్హతను బట్టి తిరిగి యాప్‌లో నమోదు చేస్తున్నారు. కాగా జిల్లాలో లక్షా 21వేల 600 మంది రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో లక్షా 19 వేల 466 మందిని అన్నదాతా సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు. 2 వేల 134మంది రైతులకు ఈకేవైసీ పూర్తికాలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద కుటుంబలో ఒకరికి మాత్రమే రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. నమోదుకు ఎలాంటి గడువు విధించలేదు. ఆధార్‌, బ్యాంకు ఖాతా అనుసంధానం కానివారు, భూమి కొనుగోలు దారులు, వెబ్‌ల్యాండ్‌లో పేరు మారినవారు ఉంటే రైతుసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే మన్యంలో అర్హులైన రైతులను గుర్తించామని, త్వరలోనే వారి ఖాతాల్లో అన్నదాతా సుఖీభవ పథకం కంద రూ.20 వేలు జమకానుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌ పాల్‌ తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి రైతుకూ అన్నదాతా సుఖీభవ పథకం వర్తిస్తుందని, కూటమి ప్రభు త్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.

తప్పిదాలు జరగకుండా చూడాలి..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాలూరు మండలం కొదమ పంచాయతీ రైతులకు చెందిన రైతుభరోసా నగదు అదే మండలంలోని శివరాంపురంలో ఉన్న సుమారు 20 మందికిపైగా ఖాతాల్లో జమైంది. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం వల్ల వారి ఖాతాల్లోంచి తిరిగి డబ్బులు తీసుకోవడానికి జిల్లా అధికారులు తలలుపట్టుకున్నారు. అయితే ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:44 PM