Share News

Exercise for the post of TDP district president టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిపై కసరత్తు

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:32 PM

Exercise for the post of TDP district president తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే గ్రామ, వార్డు, నగర, మండల, పట్టణ కార్యవర్గాలు ఏర్పాటుకాగా జిల్లా కార్యవర్గం ఎంపికపై తాజాగా కసరత్తు మొదలైంది. ఇందుకోసం టీడీపీ అధిష్టానం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి త్రీమాన్‌ కమిటీని నియమించింది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ కమిటీలు పర్యటించి పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

Exercise for the post of TDP district president టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిపై కసరత్తు
మంత్రి సుభాష్‌ను సన్మానిస్తున్న మంత్రి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిపై కసరత్తు

- అభిప్రాయాలు సేకరించిన త్రీమాన్‌ కమిటీ

- ఆసక్తి చూపుతున్న ఐదుగురు

- వచ్చే నెల 3న అధినేత చంద్రబాబు

ప్రకటించే అవకాశం

విజయనగరం/ రూరల్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే గ్రామ, వార్డు, నగర, మండల, పట్టణ కార్యవర్గాలు ఏర్పాటుకాగా జిల్లా కార్యవర్గం ఎంపికపై తాజాగా కసరత్తు మొదలైంది. ఇందుకోసం టీడీపీ అధిష్టానం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి త్రీమాన్‌ కమిటీని నియమించింది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ కమిటీలు పర్యటించి పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి త్రీమాన్‌ కమిటీ సభ్యులైన మంత్రి వాసంశెట్టి శుభాష్‌, నాయకులు మహ్మద్‌ షరీఫ్‌, పీవీజీఆర్‌ నాయుడు (గణబాబు) మంగళవారం విజయనగరం వచ్చారు. వీరిని పార్టీ నాయకులు టీడీపీ జిల్లా కార్యాలయం (అశోక్‌ బంగ్లా)లో కలిశారు. సమావేశం మాత్రం వర్షం కారణంగా అయోధ్యమైదానం రోడ్డులో ఉన్న పీవీజీ క్షత్రియ పరిషత్‌ కళ్యాణ మండపంలో నిర్వహించారు. త్రీమాన్‌ కమిటీకి పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిమిడి నాగార్జున, ఐవీపీ రాజు స్వాగతం పలికారు. విజయనగరం ఎమ్మెల్యే అదితీగజపతిరాజు అమరావతిలో ఉన్న కారణంగా హాజరుకాలేదు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణా రంగారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్‌నాయుడుతో త్రీమాన్‌ కమిటీ సమావేశమైంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి కోసం అశావాహులు ఎవరు? జిల్లాలో పార్టీ బలం, బలహీనత ఏంటి? రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఏం చేయాలన్న దానిపై చర్చించారు.

జిల్లా అధ్యక్ష పదవిపై ఐదుగురి చూపు

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కిమిడి నాగార్జున ఉన్నారు. తనకు అవకాశం ఇస్తే మరోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇదే విషయాన్ని త్రీమాన్‌ కమిటీకి వివరించారు. ఈయనతో పాటు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, సువ్వాడ రవిశేఖర్‌, కరణం శివరామకృష్ణలు తమకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే రాజాం నియోజకవర్గానికి చెందిన కొల్ల అప్పలనాయుడు సీనియర్‌ అయిన తనకు అవకాశం కల్పించాలని కోరారు. నాగార్జున కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అయితే టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి తూర్పు కాపు సామాజిక వర్గానికి, ప్రధాన కార్యదర్శి పదవి వెలమ సామాజిక వర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ రాజు తొమ్మిది పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు.

3న జిల్లా అధ్యక్షుడి ప్రకటన?

త్రీమాన్‌ కమిటీ సేకరించిన అభిప్రాయాలను నివేదిక రూపంలో రాష్ట్ర పార్టీకి ఈ నెల 29లోగా నివేదించనున్నారు. దీనిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరిశీలించి సెప్టెంబరు 3న స్వయంగా ప్రకటించనున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రకటన అనంతరం మరో 32 మందిని జిల్లా కమిటీలోకి తీసుకోనున్నారు. ఈ కమిటీతో పాటు అనుబంధ సంఘాలు యువత, మహిళ, లీగల్‌, ఎస్‌సీ, ఎస్‌టీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, రైతు ఇలా పది అనుబంధ సంఘాల కమిటీలు ఎంపిక ప్రక్రియ సెప్టెంబరు నెలాఖరులోగా పూర్తికానుంది. అక్టోబరు నుంచి కొత్త కమిటీలు పనిచేయనున్నాయి.

Updated Date - Aug 26 , 2025 | 11:32 PM