Studies చదువుల్లో రాణించాలి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:08 AM
Excel in Studies గిరిజన విద్యార్థినులు చదువుల్లో రాణించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవర్‌స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. పూతికవలస గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నతపాఠశాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు.
సీతంపేట రూరల్,సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థినులు చదువుల్లో రాణించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవర్‌స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. పూతికవలస గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నతపాఠశాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గూడంగి కాలనీలో మల్టీపర్పస్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని టీడబ్ల్యూ డీఈ నాగభూషణ్‌ను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మ ర్రిపాడు పీహెచ్‌సీలో రోజువారీ ఓపీ, సీజనల్ వ్యాధులపై వైద్యాధికారి సత్యవాణిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏపీవో జి చిన్నబాబు,హెచ్‌ఎం ఊర్వశి తదితరులు ఉన్నారు.