Everything is ready for the conference. సదస్సుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:25 AM
Everything is ready for the conference. అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని 43వ డివిజన్ పరిధిలోని గాంధీపార్కులో సదస్సు జరుగనుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరుకానున్నారు.
సదస్సుకు సర్వం సిద్ధం
నేడు అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా పేరుతో కార్యక్రమం
విజయనగరం/విజయనగరం టౌన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని 43వ డివిజన్ పరిధిలోని గాంధీపార్కులో సదస్సు జరుగనుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరుకానున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాల మేరకు సిబ్బంది పార్కులో పిచ్చిమొక్కలను తొలగించడమే కాకుండా, పార్కును శుభ్రం చేశారు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి సహకారంతో పార్కులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు వీఎంఆర్‌డీఏ మంజూరు చేసిన రూ.35 లక్షల 85 వేలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈనెల 2న వీఎంఆర్‌డీఏ చైర్మన్ మానం వెంకటప్రణవ్‌గోపాల్, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా పనులు ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, కార్పొరేటర్ దాసరి సత్యవతి, సీఐ ఆర్‌వీఆర్‌కె చౌదరి, పలు విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, అసోసియేషన్‌ల ప్రతినిధులు, కాలనీ చుట్టుపక్కల వాసులు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు.