Everything is ready for Giri Pradakshina గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:01 AM
Everything is ready for Giri Pradakshina రామతీర్థంలో గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ చేపట్టేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం
రేపు ఉదయం ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనాలు
8 గంటలకు గోపూజ, మెట్లోత్సవం
ఏర్పాట్లు పూర్తిచేసిన రామతీర్థం దేవ స్థానం అధికారులు
నెల్లిమర్ల, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రామతీర్థంలో గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ చేపట్టేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆ రోజు వేకువజాము 3 గంటలకు స్వామికి ఆరాదన, 4 గంటలకు తిరుప్పావై నిర్వహిస్తారు. 5 గంటలకు స్వామిని ఉత్తరద్వారంలో ప్రతిష్టించి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. 7.30 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు. అనంతరం స్వామిని పల్లకీలో అధిష్టింపజేసి తిరువీధి మహోత్సవం ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు నీలాచలం కొండ మెట్ల వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అక్కడ ముందుగా గోపూజ నిర్వహించాక ప్రతీ మెట్టుకు పసుపురాసి, బొట్టుపెట్టి మెట్లోత్సవం జరిపిస్తారు. 9 గంటలకు గిరిప్రదక్షిణ మొదలవుతుంది. సుమారు 8 కిలోమీటర్ల దూరముండే నీలాచలం చుట్టూ స్వామివారి ప్రదక్షిణ ఉంటుంది. ఉత్తరద్వార దర్శనం, మెట్లోత్సవం, గిరిప్రదక్షిణ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అర్చకులు కోరారు.