Share News

సర్వం సిద్ధం

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:07 AM

జిల్లాలో దసరా శోభ సంతరించుకుంది. సోమవారం నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభంకానున్నాయి.

  సర్వం సిద్ధం
దుర్గాదేవి

- నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు

- ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు

విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దసరా శోభ సంతరించుకుంది. సోమవారం నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 2 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఆలయాలను ముస్తాబు చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌ దీపాల కాంతులతో ఆలయాలు ధగధగ మెరిసిపోతున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల్లోపు దుర్గాదేవికి కలశస్థాపన చేసి, పూజలు నిర్వహించేందుకు పురోహితులు నిర్ణయించారు. మండపాల్లో కొలువుదీర్చేందుకు దుర్గాదేవి విగ్రహాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రోజుకో అవతారంలో దుర్గాదేవి దర్శనమివ్వనున్నారు. చివరి మూడు రోజులు దుర్గాష్టమి, మహార్నవమి, దశమి రోజున దుర్గాదేవికి విశేషపూజలు నిర్వహించనున్నారు.

పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో..

పాలకొండ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, భక్తుల కోర్కెలు తీర్చే పాలకొండ కోటదుర్గమ్మ శరనన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు అమ్మవారు నిజరూపంలో దర్శనమివ్వనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు, టెంట్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:07 AM