ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:08 AM
కాలుష్య నివారణకు ప్రతిఒక్కరూ తలో మొక్కను నాటి సంరక్షణ చేపట్టాలని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం టౌన్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కాలుష్య నివారణకు ప్రతిఒక్కరూ తలో మొక్కను నాటి సంరక్షణ చేపట్టాలని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు గాంధీ విగ్రహం వద్ద శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కాలుష్యం పట్ల అవగాహన కల్పించాలన్నారు. భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించే దిశగా కృషి చేయాలన్నారు. నగరంలో 50వేల పండ్ల మొక్కలు పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. అనంతరం పెద్దచెరువు గట్టుపై మొక్కలను నాటారు. ముందుగా నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందించిన 12 మంది పారిశుధ్య కార్మికులకు దుశ్శాలువాతో సత్కారం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ నల్లనయ్య, కాలుష్య నియంత్రణాధికారి సరిత, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, మెప్మా పీడి చిట్టిరాజు, స్థానిక టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దల నరసింగరావు, ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.