ప్రతిఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:28 AM
ప్రతిఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి
భోగాపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. శనివారం స్థానిక మండ ల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఉద్యమ రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రతిఒక్కరూ వారి ఆలోచన ప్రకారం చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. రిజిస్ట్రేషన్, రాయితీ తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ కరుణాకర్, కోఆర్డినేటర్ శశికళ నియోజకవర్గ ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, మిరాకిల్ సీఈవో ప్రసాదు లోకం, డీపీఎం రాజ్‌కుమార్, ఏపీఎం జగదీష్, నాయకులు పల్లంట్ల జగదీష్, బొల్లు త్రినాథ్, గుండపు సూరిబాబు, ఆళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.