Scientist ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:33 PM
Every Student Should Grow Into a Scientist ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆకాక్షించారు. శుక్రవారం స్థానిక డీవీఎం పాఠశాలలో సైన్స్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు చెప్పినట్లుగా విద్యార్థులు నడుచుకోవాలన్నారు.
బెలగాం, డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆకాక్షించారు. శుక్రవారం స్థానిక డీవీఎం పాఠశాలలో సైన్స్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు చెప్పినట్లుగా విద్యార్థులు నడుచుకోవాలన్నారు. క్రమశిక్షణతో విద్యనభ్యసించి.. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. నవీన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని.. లక్ష్యాల సాధనకు విద్యార్థి దశ నుంచే తీవ్రంగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు శాస్ర్తీయ ధృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు. నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశాన్నీ ప్రశ్నించడం అలవాటు చేసుకున్నప్పుడే గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని అన్నారు. సమాజంలోని సమస్యలు కనుక్కొని వాటి పరిష్కారం దిశగా ఆలోచించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్నప్పుడే మేధావులైన విద్యార్థులు తయారవుతారన్నారు. సామాన్యుడి చేరువయ్యేలా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని తెలిపారు. సరైన వ్యక్తులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకుంటే పరిజ్ఞానం పెరుగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో బ్రహ్మాజీరావు, డిప్యూటీ డీఈవోలు రాజ్‌కుమార్, కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, పలు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొనన్నారు.