Share News

Degree ప్రతీ విద్యార్థి డిగ్రీ పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:56 PM

Every Student Must Complete Their Degree జిల్లాలో ప్రతీ విద్యార్థి డిగ్రీ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. అడ్మిషన్ల కోసం ఎటువంటి సర్టిఫికెట్‌ అవసరం లేదని, అపార్‌ ఐడీ పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నెంబర్‌ (పెన్‌) ఉంటే చాలని ఆయన తెలిపారు.

  Degree  ప్రతీ విద్యార్థి డిగ్రీ పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతీ విద్యార్థి డిగ్రీ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. అడ్మిషన్ల కోసం ఎటువంటి సర్టిఫికెట్‌ అవసరం లేదని, అపార్‌ ఐడీ పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నెంబర్‌ (పెన్‌) ఉంటే చాలని ఆయన తెలిపారు. డిగ్రీ లేకుండా ఎవరూ ఉండరాదన్నారు. డ్రాపౌట్స్‌ లేకుండా చూడాలని, బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. బడిమానేసిన పిల్లల జాబితాను సిద్ధం చేసి, వారు ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. తిరిగి వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో కంప్యూటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు హెచ్‌బీ లెవెల్స్‌ ఎక్కువ ఉండేలా చూడాలన్నారు.

కలెక్టరేట్‌ ప్రతిపాదిత స్థలం పరిశీలన

పార్వతీపురం రూరల్‌: అడ్డాపుశీల ప్రాంతంలో కలెక్టరేట్‌ నిర్మాణానికి గతంలో ప్రతిపాదించిన స్థలాన్ని బుధవారం కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పరిశీలించారు. నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పార్వతీపురం తహశీల్దార్‌ సురేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 11:56 PM