Share News

Industry ప్రతి సచివాలయం పరిధిలో పరిశ్రమ ఉండాలి

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:28 PM

Every Secretariat Jurisdiction Should Have an Industry జిల్లాలోని ప్రతి సచివాలయం పరిధిలో ఒక పరిశ్రమ నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్ట రేట్‌లో పరిశ్రమలశాఖ అధికారులతో సమీక్షించారు. ప్రతి గ్రామం నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు.

  Industry  ప్రతి సచివాలయం పరిధిలో పరిశ్రమ ఉండాలి
కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కలకు నీరు పొస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి సచివాలయం పరిధిలో ఒక పరిశ్రమ నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్ట రేట్‌లో పరిశ్రమలశాఖ అధికారులతో సమీక్షించారు. ప్రతి గ్రామం నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ఈ ఏడాది 2,100 యూనిట్లు నెలకొల్పాలని సూచించారు. ఇందుఓసం సచివాలయ ఇంజనీరింగ్‌ సహాయకులను వినియోగించుకోవాలన్నారు. ఏపీఐఐసీ, ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు త్వరగా గ్రౌండింగ్‌ అయ్యేలా చూడాలన్నారు. ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతో పాటు అనుకూల, మూతపడిన వాటి వివరాలు సేకరించాలన్నారు. మూతపిన పరిశ్రమలను తెరిపించేందుకు అవకాశాలను అన్వేషించాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ మొక్కలు నాటారు. ఆయన వెంట జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, డీఆర్వో హేమలత తదితరులు ఉన్నారు.

పర్యాటక ప్రదేశాలపై రీల్స్‌

జిల్లాలో చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాలు, జలపాతాలపై 60 సెకెండ్ల నిడివితో రీల్స్‌ చేసి ఈ నెల 30లోగా మన్యం.పబ్లిసిటీజీమెయిల్‌.కామ్‌కు పంపాలని కలెక్టర్‌ సూచించారు. వాటిల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి.. విజేతలకు దసరా ఉత్సవాల సందర్భంగా బహుమతులు అందిస్తామని వెల్లడించారు. ప్రథమ బహుమతి కింద రూ.5 వేలు, ద్వితీయ స్థానం దక్కించుకున్న వారికి రూ.3వేలు, తృతీయ బహుమతి పొందిన వారికి రూ.2వేలు చొప్పున అందిస్తామన్నారు.

సమష్టి కృషితో స్వచ్ఛ పార్వతీపురం

బెలగాం: సమష్టి కృషితోనే స్వచ్ఛ పార్వతీపురం సాధ్యమవు తుందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులంతా ఇందులో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మున్సిపల్‌ పార్క్‌లో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పాల్గొని మొక్కలు నాటి అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ పార్వతీపురానికి ప్రతిఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఒక్కరోజుతోనే కాదని ఈ కార్యక్రమాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. రోజూ ఇంటి పరిసరాలు, కార్యాల యాలు వాణిజ్య, వ్యాపార సంస్థలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే స్వచ్ఛ పార్వతీపురం సాధ్యమ వుతుందన్నారు. పాడైన ఎలక్ర్టానిక్‌ పరికరాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో రెవెన్యూ కోర్టులు

పార్వతీపురం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో రెవెన్యూ కోర్టులు నిర్వహించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. పిటిషనర్లను కార్యాల యానికి పిలిపించకుండా వారి వద్దకే వెళ్లి న్యాయాన్ని అందించాలన్నారు. శనివారం పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు వైశాలి, స్వప్నిల్‌ జగన్నాథ్‌ తో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో రెండు డివిజన్లలో సుమారు 120 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ మూడు నెలల్లోగా పరి ష్కరించాలని సూచించారు. రెవెన్యూ కోర్టుల నిర్వహణకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, నిర్ధిష్ట ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.

Updated Date - Sep 20 , 2025 | 11:28 PM