ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:28 PM
జిందాల్ యాజమాన్యం 2008లో నిర్వహించిన ప్రజాప్రాయసేకరణలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని సీపీఎం జిల్లా నేత చల్లా జగన్ డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా నేత చల్లా జగన్
జిందాల్ నిర్వాసితులతో కలిసి నిరసన
శృంగవరపుకోట రూరల్ జూలై 19 (ఆంరఽధజ్యోతి): జిందాల్ యాజమాన్యం 2008లో నిర్వహించిన ప్రజాప్రాయసేకరణలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని సీపీఎం జిల్లా నేత చల్లా జగన్ డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు, పరిశ్రమల్లో వాటా ఇలా చాలా హామీలు ఇచ్చారని, వాటిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదని తెలిపారు. శనివారం బొడ్డవరలో ఆయన నిర్వాసితులతో మాట్లాడారు. జిందాల్ యాజ మాన్యం ఇచ్చిన స్ర్కిప్టును ప్రారంభం నుంచి కలెక్టర్, మంత్రి శ్రీనివాస్, ఇప్పుడు హోం మంత్రి చెబుతున్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్‌లో పెడతామన్న కంపెనీల్లో ఏవిధంగా న్యాయం చేస్తారో అన్న విషయంపై వీరితో చర్చించకపోవడం బాధా కరమన్నారు. భూములిచ్చి దగా పడ్డవారిని విస్మరించడం తగదన్నారు.