ప్రతి హామీ పక్కాగా అమలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:05 AM
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని పక్కాగా అమలు చేస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.. వైసీపీ అరాచకపాలన పుణ్యమా అని రాష్ట్రం సర్వనాశనమైపోయిందని, దీనిని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తోందని చెప్పారు.శనివారం బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడుచేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
బొబ్బిలి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని పక్కాగా అమలు చేస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.. వైసీపీ అరాచకపాలన పుణ్యమా అని రాష్ట్రం సర్వనాశనమైపోయిందని, దీనిని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తోందని చెప్పారు.శనివారం బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడుచేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. పారాది వంతెన నిర్మాణం పూర్తి చేయడం చేతకాకపోవడంతో ఆ బాధ్య తలను తాము నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ రోడ్ల దుస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బొబ్బిలి-తెర్లాం రోడ్డుకు రూ.4.50 కోట్లు, స్టేట్‌హైవేకు రూ. 4.50 కోట్లు, ఆకులకట్ట-పినపెంకి రోడ్డుకు రూ.2.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.బొబ్బిలిలోని పలు రోడ్లకుమరమ్మతుల కోసం సుమారు రూ.10 లక్షలు వెచ్చించామని, వీటికి సంబంధించిన పక్కా లెక్కలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల్లో ఘోర పరాజయంచూసిన తరువాత శంబంగి మతిసక్రమంగా పనిచే యడం లేదన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగి పలు వురు చనిపోయారని శంబంగి విమర్శించడం హాస్యా స్పదంగా ఉందని, శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేతకు గ్రోత్‌సెంటరులో కోట్లాది రూపాయల భూమిని కారుచౌకగా అప్పగించారని, తాగు, సాగునీటి ప్రయోజ నాలను సైతం తాకట్టుపెట్టి ఓ ఇరిగేషన్ అధికారి సహకా రంతో అనుమతులు తెప్పించుకున్నారని ఆరోపించారు.తమ హయాం లోనే గ్రోత్‌సెంటరు అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చాయని, ఇంకా ము ఖ్యమైన పరిశ్రమలు త్వరలో రానున్నాయని చెప్పారు. వైసీపీ హయాం లో పారదర్శక పాలనకు పూర్తిగా తిలోదకాలిచ్చారని విమర్శించారు. సూ పర్ సిక్స్ పథకాలు అమలు చేసినట్లే మిగిలిన పథకాలన్నీ అమలవుతా యని తెలిపారు. రైతులకు యూరియా సమస్య లేకుండా చర్యలు తీసు కుంటున్నామని, పదిరోజుల్లోగా రైతులకు సరిపడా యూరియా వస్తుందని చెప్పారు. ఇటీవల బొబ్బిలి నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణీకులు కొట్టుకునే అంశాన్ని వైరల్ చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర జరుగుతుందేమోనన్న అంశంపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చా మని, వైసీపీకి చెందిన వారు రాష్ట్రవ్యాప్తంగా పలు రకాలుగా దుష్ప్ర చారానికి పూనుకున్న అంశాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. సమావేశంలో మునిసి పల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి అల్లాడ భాస్కరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బొంతు త్రినాథ పాల్గొన్నారు.