ప్రతి అర్జీని పరిష్కరించాలి: కలెక్టర్
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:45 PM
పీజీఆర్‌ఎస్‌లో నమోదైన ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి కోరారు. పరిష్క రించిన అంశాలపై అర్జీదారుడికి లిఖితపూర్వకంగా ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తెలిపారు.వివిధ అంశాలపైకలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా నుంచి కలెక్టర్‌తోపాటు జేసీ ఎస్.సేతుమాధవన్ హాజరయ్యారు. గృహాల లేఅవుట్‌ల్లో ఖాళీగాఉన్న స్థలాలనుగుర్తించి, అందరికీ ఇళ్లు కేటాయించేలా ప్రతి పాదనలు సిద్ధంచేయాలని సీసీఎల్‌ఏ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, కార్యదర్శి వెంకట మురళి ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎస్.శ్రీనివాస మూర్తి పాల్గొన్నారు.
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో నమోదైన ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి కోరారు. పరిష్క రించిన అంశాలపై అర్జీదారుడికి లిఖితపూర్వకంగా ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తెలిపారు.వివిధ అంశాలపైకలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా నుంచి కలెక్టర్‌తోపాటు జేసీ ఎస్.సేతుమాధవన్ హాజరయ్యారు. గృహాల లేఅవుట్‌ల్లో ఖాళీగాఉన్న స్థలాలనుగుర్తించి, అందరికీ ఇళ్లు కేటాయించేలా ప్రతి పాదనలు సిద్ధంచేయాలని సీసీఎల్‌ఏ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, కార్యదర్శి వెంకట మురళి ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎస్.శ్రీనివాస మూర్తి పాల్గొన్నారు.
రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి
ప్రతినెలా పౌరహక్కుల దినం గ్రామాల మధ్యలో జరగాలని,ఇందులో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరి యంలో జిల్లావిజిలెన్స్ అండ్ మోనటరింగ్‌సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ కాలనీలకు రహదారులులేవని, శ్మశానాలు ఆక్రమణలకు గురవు తున్నాయని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.దీంతో కలెక్టరు స్పందించి మాట్లాడు తూ ఉపాధినిధులతో రహదారులను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించాలని డ్వామా అధికారులకు సూచించారు. జిల్లాలో నమోదైన 35 అట్రాసిటీ కేసులకు గాను 42 లక్షల 79 మే పరిహారంగా చెల్లించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్పీ దామోదర్ , ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, డీఆర్వోశ్రీనివాస్ మూర్తి, సోషల్ వెల్పేర్ డీడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సహకార సంస్థలు డేటాను అందించాలి
ఫంక్షనల్ సహకార సంస్థలు డేటాను జిల్లా సహకార అధికారికి సమర్పించాలని, ఆ డేటాను నేషనల్ కోఆపరేటివ్ బేస్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ కోఆపరేటివ్ ద్వారా జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని మార్కెటింగ్ ఏడీతో మాట్లాడుకుని, ఆ స్పేస్‌ను వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డీసీవో రమేష్‌కు సూచించారు.
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఇద్దరి ఎంపిక
విజయనగరం కలెక్టరేట్ అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన స్కూల్స్‌గ్రేమ్స్‌లో జిల్లా నుంచి అండర్-14, అండర్-17, అండర్ -19 కేటగిరిల్లో బాక్సింగ్ పోటీల్లో పాల్గొనగాఅండర్-17లో పి.దుర్గాప్రసాద్ (46 కేజీలువిభాగంలో) సచిన్ (75కేజీల విభాగంలో) రాష్ట్రస్థాయిలో బంగారుపతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిద్దరూ ఈనెల 28 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికకాగా శుక్రవారం బయలుదేరి వెళ్లనున్నారు. కాగా అండర్-19 కేటగిరిలో హేమేష్‌వర్ధన్‌రెడ్డి 46 కేజీల విభాగంలో, ఎస్.యశ్వంత్60కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారుపతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికకావడంతో బుధవారం రాత్రి కలెక్టరు రామసుందర్ రెడ్డిని కలిశారు.