Share News

Every employee should adopt ప్రతి ఉద్యోగి దత్తత తీసుకోవాలి

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:09 AM

Every employee should adopt పీ4 కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉద్యోగి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని మార్గదర్శులుగా నిలవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతు మాధవన్‌ సూచించారు. పీ4 కార్యక్రమంపై శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, డివిజన్‌, మండల అధికారులలో సమావేశం నిర్వహించారు.

Every employee should adopt    ప్రతి ఉద్యోగి దత్తత తీసుకోవాలి
మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతుమాధవన్‌

ప్రతి ఉద్యోగి దత్తత తీసుకోవాలి

బంగారు కుటుంబాలను ఆదుకోవాలి

ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతు మాధవన్‌

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): పీ4 కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉద్యోగి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని మార్గదర్శులుగా నిలవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతు మాధవన్‌ సూచించారు. పీ4 కార్యక్రమంపై శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, డివిజన్‌, మండల అధికారులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని, ఆయన స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని అధికారులు, సిబ్బంది ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పారు. జిల్లాకు నిర్దేశించిన 67 వేల లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శులను గుర్తించాలని నిర్దేశించారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వచ్చే నెల 5వ తేదీలోగా పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారు కూడా వారి వద్ద పని చేస్తున్న కుటుంబాలను లేదా ఇతర పేద కుటుంబాలను దత్తత తీసుకుని, తోడ్పాటు అందించేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు.

కాల్‌ సెంటర్‌ 1100ను వినియోగించుకోండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) అర్జీదారులు కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతు మాధవన్‌ ఒక ప్రకటనలో కోరారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, సమాచారం తెలుసుకోవడానికైనా ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 12:09 AM