ప్రాణ ం పోయినా గ్రామం విడిచేదిలేదు
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:05 AM
ప్రాణం పోయినా సరే తమ గ్రామం వదిలి వెళ్లేది లేదని మారిక గిరిజను లు స్పష్టం చేశారు.
వేపాడ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రాణం పోయినా సరే తమ గ్రామం వదిలి వెళ్లేది లేదని మారిక గిరిజను లు స్పష్టం చేశారు. తమ గ్రామానికి వచ్చిన అదానీ కంపెనీ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులను సీపీఎం నాయకుడు చలుమూరి శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతిఘ టించారు. తమ గ్రామంలో అదానీ కంపెనీ పెట్టవద్దని తెగేసి చెప్పారు. మారిక అడవితల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమ పొట్టలు కొట్టొద్దని, మారిక కొండపై ఆధానీ పవర్ ప్లాంట్ పెట్టొద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా అదానీ కంపెనీ కోసం అమాయక గిరిజనుల భూములను దౌర్జన్యంగా తీసుకునేందుకు ప్రయత్నించడం ఘోరమన్నారు. సీపీఎం నాయకుడు చలుమూరి శ్యామ్, గిరిజన నాయకుడు జాలారి వీర్రాజు, గమ్మెల బాబూరావు, సోమేష్, అప్పలనాయుడు, కరకవలస సర్పంచ్ పెంటమ్మల సారథ్యంలో రహదారికి అడ్డంగా బ్యానర్‌తో అడ్డంగా కంచె వేసి అడ్డుగా నిల్చొని ఆధానీ కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడ్డుకున్నారు. ఈసందర్భంగా సర్పంచ్ పాతబోయిన పెంటమ్మ మాట్లాడుతూ కష్టంలో రాజకీయ పార్టీలైన వైసీపీ, తెలుగు దేశం, జనసేన పార్టీలు తమకు మద్దతు ఇవ్వకుండా ఉండడం దారుణం అన్నారు. ఈ కార్యక్ర మంలో గిరిజన నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.