Will You Still Ignore It?మూలకు చేరినా.. పట్టించుకోరా?
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:14 PM
Even After Reaching the Limit… Will You Still Ignore It? పార్వతీపురం మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వ హణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వచ్ఛ సుందర కార్యక్రమానికి తూట్లు పడుతున్నాయి. పురపాలక సంఘానికి చెందిన ‘పారిశుధ్య’ వాహనాలు ఒక్కొక్కటిగా మూలకు చేరుతున్నాయి. వాటి మరమ్మతుల విషయంలో అధికారులు స్పందించడం లేదు.
పార్వతీపురంలో పారిశుధ్య నిర్వహణకు ఇబ్బందులు
స్వచ్ఛ సుందర కార్యక్రమానికి తూట్లు
స్పందించని అధికారులు
పార్వతీపురంటౌన్, డిసెంబరు6(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వ హణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వచ్ఛ సుందర కార్యక్రమానికి తూట్లు పడుతున్నాయి. పురపాలక సంఘానికి చెందిన ‘పారిశుధ్య’ వాహనాలు ఒక్కొక్కటిగా మూలకు చేరుతున్నాయి. వాటి మరమ్మతుల విషయంలో అధికారులు స్పందించడం లేదు. మున్సిపల్ ఇంజనీరింగ్, ప్రజారో గ్యశాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా కేంద్రంగా ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ పార్వతీపురం మున్సిపాల్టీ పరిస్థితేమీ మారలేదు. ప్రధానంగా 30వార్డుల్లో ప్రజలను పారిశుధ్యం, తాగునీటి సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సుమారు ఐదేళ్ల కిందట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పట్టణంలోని ప్రధాన రహదారి లోని చెత్తలను తరలించేందుకు రూ.40 లక్షలతో రెండు కంపాక్టర్లను మంజూరు చేశారు. అయితే అవి పనిచేసినంత కాలం ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగాల చక్కగా వినియోగించుకున్నారు. రెండు నెలల కిందట ఒక్కొక్కటిగా మరమ్మతులకు గురువడంతో వాటిని పట్టిం చుకునే వారే కరువయ్యారు. సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. 30 వార్డులు, ప్రధాన రహదారిలోని రెస్టారెంట్లు, పలు దుకాణాలు, హోటళ్ల నుంచి రోజుకు సుమారు 15 టన్నుల వరకు చెత్త, వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. కాగా రెండు కంపాక్టర్‌లు మరమ్మతులకు గురి కావడంతో చెత్తల తరలించేందుకు పారిశుధ్య కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు.
- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన రహదారి, బైపాస్ రోడ్డు, పార్కుల్లో నాటిన మొక్కలకు రోజు నీటిని అందించేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత పది రోజులుగా అది పనిచేయడం లేదు. మరమ్మతులకు గురికావడంతో షెడ్‌కు చేరింది. దీనిపై కూడా అధికారులు శ్రద్ధ చూపడం లేదు.
- స్వచ్ఛ సుందర కార్యక్రమ నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అఽధికారులు బడ్జెట్‌లో చూపిస్తున్నారు. కానీ మరమ్మతులకు గురైన మునిసిపాలిటీ వాహన విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. రెండు నెలలుగా ఒక కంపాక్టర్ పార్వతీపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పడి ఉంది. మరొక దానిని మరమ్మ తుల కోసం విజయనగరం పంపించారు. మొక్కలకు నీటిని అందించే ట్రాక్టర్ మరమ్మతుల కోసం ఇంజనీరింగ్ అధికారులు అపసోపాలు పడుతున్నారు.
-ఇప్పటికే పార్వతీపురంలోని పలు వార్డుల్లో పారిశుధ్యం క్షీణించింది. ఎక్కడికక్కడే చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి. చెత్తలను తరలించే కంపాక్టర్‌లను తక్షణమే బాగు చేసి వినియోగంలోకి తేవాలని పట్టణవాసులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
- దీనిపై మున్సిపల్ కమిషనర్ కె.కిషోర్‌కుమార్‌ను వివరణ కోరగా..‘ కంపాక్టర్లతో పాటు ట్రాక్టర్‌కు త్వరితగతిన మరమ్మతులు చేపడతాం. త్వరలోనే వాటిని అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించాం.’ అని తెలిపారు.