Share News

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:44 PM

రైతుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, ఎస్‌.కోట పీఎసీఎస్‌ చైర్మన్‌ జీఎస్‌ నాయుడు,డైరక్టర్‌ గెదెల శ్రీను తెలిపారు. సోమవారం మండలంలోని వెంకటరమణపేటలో ఏవో రవీంద్ర ఆధ్వర్యంలో ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పా టుచేశారు.

 ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
ఎస్‌.కోట రూరల్‌: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న దృశ్యం

ఎస్‌.కోట రూరల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, ఎస్‌.కోట పీఎసీఎస్‌ చైర్మన్‌ జీఎస్‌ నాయుడు,డైరక్టర్‌ గెదెల శ్రీను తెలిపారు. సోమవారం మండలంలోని వెంకటరమణపేటలో ఏవో రవీంద్ర ఆధ్వర్యంలో ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పా టుచేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు డోకుల అచ్చెంనాయుడు, కార్య దర్శి జగదీష్‌, గోపాలపల్లి సర్పంచ్‌ ఆడారి మహేశ్వరరావు, వినాయకపల్లి సర్పంచ్‌ గనివాడ సన్యాసినాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, గ్రామపెద్దలు రాపర్తి సాదు, జుత్తాడ రామసత్యం, తహసీల్దార్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రైతులు మోసపోవద్దు

భోగాపురం, నవంబరు24(ఆంధ్రజ్యోతి): దళారులను నమ్మి రైతులు మోసపో వద్దని తహసీల్ధార్‌ ఎం.రమణమ్మ, ఏవో హైమావతి తెలిపారు. సోమవారం భోగాపురం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది జనార్దనరావు, నాయకులు పల్లంట్ల గజదీష్‌, గుండపు సూర్యారావు, రమణ పాల్గొన్నారు.

ఫకొత్తవలస, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతులు ధాన్యాన్ని రైతు సేవాకేంద్రంలో విక్రయించుకోవాలని కొత్తవలస పీఏసీఎస్‌ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ కోరారు. సోమవారం మండలంలోని వీరభద్రపురంలోని రైతు సేవాకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏవో రాంప్రసాద్‌, సీఎస్‌డీటీ చిరంజీవి, టీడీపీ నాయకులు రమేష్‌,కనకాల శివ,సూరిబాబు, నక్కరాజు చిన రాము, కొరుపలు అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:44 PM