Share News

established ganesh ideals కొలువుదీరిన గణపతులు

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:16 AM

established ganesh ideals వాడవాడలా గణనాథుడు కొలువుదీరాడు. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మండపాల్లో వివిధ రూపాల్లో పూజలందుకుంటున్నాడు. వినాయక చవితి బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది.

established ganesh ideals కొలువుదీరిన గణపతులు
బొబ్బిలి: చీపురుపల్లి వీధిలో దశావతారాల్లో వినాయకుడు

కొలువుదీరిన గణపతులు

గ్రహణం కారణంగా నిమజ్జనానికి తొమ్మిది రోజులే గడువు

విజయనగరం/ కల్చరల్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వాడవాడలా గణనాథుడు కొలువుదీరాడు. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మండపాల్లో వివిధ రూపాల్లో పూజలందుకుంటున్నాడు. వినాయక చవితి బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ప్రతి ఇంట్లోనూ పిల్లల నుంచి పెద్దలవరకూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అదే విధంగా గ్రహణం కారణంగా నిమజ్జనానికి ఈ ఏడాది ఎక్కువ మంది తొమ్మిది రోజులతో సరిపెట్టుకోనున్నారు. వచ్చేనెల 7న రాత్రి 9.56 గంటల నుంచి చంద్రగ్రహణం ఉంది. దీంతో 13రోజులు, 21 రోజులు వినాయక ఉత్సవాలు నిర్వహించడానికి వీలుపడదని, చంద్రగ్రహణం ముందే నిమజ్జనోత్సవాలు చేసుకోవాలని పంచాంగకర్తలు ఇప్పటికే సూచించారు. దీంతో జిల్లాలో నిమజ్జనం తొమ్మిదో రోజున చేపట్టాలని నిర్ణయించుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

- విజయనగరంలోని పాత సిటీబస్టాండ్‌లో ఉన్న సిద్ధిబుద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు కొత్తపేటలో వున్న సంపత్‌ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను విభిన్న రూపాల్లో ఏర్పాటుచేసి భక్తులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తూ మండపాలను విద్యుత్‌ కాంతులతో తీర్చిదిద్దారు.

Updated Date - Aug 29 , 2025 | 12:16 AM