Share News

Environmental cleanliness is a moral responsibility పరిసరాల శుభ్రత నైతిక బాధ్యత

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:20 AM

Environmental cleanliness is a moral responsibility పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి నైతిక బాధ్యత అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ కళశాల)లో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యకమ్రంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Environmental cleanliness is a moral responsibility పరిసరాల శుభ్రత నైతిక బాధ్యత
ప్రతిజ్ఞ చేస్తున్నమంత్రి శ్రీనివాస్‌, కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి.

పరిసరాల శుభ్రత నైతిక బాధ్యత

విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం, డిసెంబరు20(ఆంధ్రజ్యోతి):

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి నైతిక బాధ్యత అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ కళశాల)లో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యకమ్రంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, చక్కని ఆరోగ్యం మనకు అందాలంటే పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాల శుభ్రత కూడా ముఖ్యమన్నారు. ప్లాస్టిక్‌ ఇతర రసాయన పదార్థాల కారణంగా పరిసరాలు విషపూరితంగా మారుతున్నాయని, ఈ పరిస్థితిలో భవిష్యత్‌ తరాల కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. దేశంతో యువత ఎక్కువగా ఉన్నారని, వారు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల న్నారు. కొన్ని దేశాల్లో ఐటీ విద్యార్థుల కంటే ఐటీఐ విద్యార్థులకు జీతాలు ఎక్కువన్నారు. కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. ఇదే ఆలోచనతో ప్రభుత్వం ప్రతీ మూడో శనివారం స్వచ్ఛాంధ్రస్వర్ణాంధ్ర కార్యక్రమం చేపడుతోందన్నారు. ఐటీఐ విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయని, రానున్న రోజుల్లో మరింతగా డిమాండ్‌ పెరుగుతుందని చెప్పారు. అంతకముందు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మొక్కలునాటారు. కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపాల్‌ టివి గిరి, జిల్లానైపున్య అభివృద్ధి అధికారి ప్రశాంత్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:21 AM