Share News

Ambedkar Gurukul Schools అంబేడ్కర్‌ గురుకులాల్లో మిగులు సీట్లకు 25న పరీక్ష

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:04 AM

Entrance Test on 25th for Vacant Seats in Ambedkar Gurukul Schools ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ ఎస్‌.రూపవతి గురువారంఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 13 గురుకులాల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

 Ambedkar Gurukul Schools అంబేడ్కర్‌ గురుకులాల్లో మిగులు సీట్లకు 25న పరీక్ష

గరుగుబిల్లి/సాలూరు రూరల్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ ఎస్‌.రూపవతి గురువారంఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 13 గురుకులాల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీకి ఈ నెల 25న బాలికలకు నెల్లిమర్ల సాంఘిక సంక్షేమ పాఠశాలలో, బాలురకు కొప్పెర్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆయా తరగతుల్లో ప్రవేశం కోరే వారు ఈ నెల 23 లోగా దరఖాస్తులివ్వాలని సూచించారు. అంబేడ్కర్‌ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశానికి పరీక్ష రాసి సీటు రాని బాలురు ఈ నెల 23న కొప్పెర్ల, బాలికలు చీపురుపల్లిలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని కోరారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ ఏడాదికి ప్రవేశపరీక్ష రాసి సీటు రాని బాలికలు ఈ నెల 26న నెల్లిమర్లలో, బాలురు 27న కొప్పెర్లలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలన్నారు. ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరానికి ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని మాత్రమే కౌన్సిలింగ్‌కు రావాలని తెలిపారు.

Updated Date - Jun 20 , 2025 | 12:04 AM