ఉత్సాహంగా నమూనా ఎన్నికలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:58 PM
ఎన్నికల నిర్వహణపై మంగళవారం దెందేరు జడ్పీ హైస్కూల్‌లో నమూనా ప్రక్రియను నిర్వహించి... విద్యా ర్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ పనితీరుతో పాటు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో తెలియజేశారు.
కొత్తవలస, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణపై మంగళవారం దెందేరు జడ్పీ హైస్కూల్‌లో నమూనా ప్రక్రియను నిర్వహించి... విద్యా ర్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ పనితీరుతో పాటు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో తెలియజేశారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, స్ర్కూటినీ, ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ప్రచార కార్యక్రమం, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. బ్యాలెట్ పేపర్, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి? ఓటు ఎలా వేయాలి? ఓట్ల లెక్కింపు, విజయం సాధించిన అభ్యర్థుల ప్రకటన, ధ్రువీకరణ పత్రం అందజేత వరకు పూర్తిగా నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా కొందరు విద్యార్థులను నియమించారు. ఈ ప్రక్రియలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇన్‌చార్జి హెచ్‌ఎం జి.రవికుమార్, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.