Share News

enjoy on the shore తీరంలో కేరింత

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:01 AM

enjoy on the shore చింతపల్లి తీరం జనసంద్రమైంది. ఎటు చూసినా యువకుల కేరింత.. పిల్లల ఆటపాటలు.. పెద్దల వనవిహారమే కనిపించింది.

 enjoy on the shore తీరంలో కేరింత
చింతపల్లి బీచ్‌కు పోటెత్తిన సందర్శకులు

తీరంలో కేరింత

కిటకిటలాడిన చింతపల్లి బీచ్‌

వేలాదిగా తరలివచ్చిన యువకులు, పిల్లలు, మహిళలు

పూసపాటిరేగ,నవంబర్‌9(ఆంధ్రజ్యోతి): చింతపల్లి తీరం జనసంద్రమైంది. ఎటు చూసినా యువకుల కేరింత.. పిల్లల ఆటపాటలు.. పెద్దల వనవిహారమే కనిపించింది. కార్తీకమాసం అందులోనూ ఆదివారం కావడంతో జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి కుటుంబాల సమేతంగా పిక్నిక్‌ కోసం వచ్చారు. రోజంతా సందడి చేశారు. గోవిందపురం వద్దనున్న ముక్తిధాంను ముందుగా సందర్శించి స్థానికంగా ఉన్న కొబ్బరి తోటల్లో వనభోజనాలు చేసి అక్కడి నుండి చింతపల్లి బీచ్‌కు క్యూ కట్టారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ తీరం కిటకిటలాడుతూ కనిపించింది. సముద్రంలో స్నానాలు చేస్తూ.. ఆటలాడుతూ ఉత్సాహంగా గడిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌తో పాటు పోలీసు సిబ్బంది గస్తీ కాశారు. డ్రోన్‌తోనూ పర్యవేక్షించారు. మెరైన్‌ పోలీసులు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

Updated Date - Nov 10 , 2025 | 12:01 AM