Share News

ఘనంగా ఇంజనీరింగ్‌ దినోత్సవం

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:50 PM

డెంకాడలోని ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం ఇంజ నీర్స్‌ దినోత్సవం నిర్వహించారు.

ఘనంగా ఇంజనీరింగ్‌ దినోత్సవం

డెంకాడ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): డెంకాడలోని ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం ఇంజ నీర్స్‌ దినోత్సవం నిర్వహించారు. ఇంజనీరింగ్‌ ఇన్నోవే షన్‌ ఫీచర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ మనూ కపూర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని, వేడుకలు ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ-1 యు గంలో కేరీర్‌ వృద్ధికి, ఆవిష్క రణలకు నైపుణ్యాలు అత్యంత ముఖ్యమన్నారు. అనంతరం ఆయన్ని ప్రిన్సిపాల్‌ డా.వైఎంసీ శేఖర్‌ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా.ఎం.సునీల్‌ ప్రకాష్‌, ఎంవీవీ భాను, ఎంవీజీఆర్‌ కో-ఆర్డినేటర్‌ కృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

విజయనగరం రింగురోడ్డు: ఆధుని కత మనుగడకు ఇంజనీర్లే కీలకమని జిల్లా లైసెన్స్‌ టెక్నికల్‌ పర్సన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఐ.ఆదినారాయణ, ఆల్తి శ్రీనివాసరావులు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సోమవారం ఇంజనీర్స్‌ డే నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అసోసియేషన్‌, ఆలా్ట్రటెక్‌ ప్రతినిధులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

గరివిడి: స్థానిక అవంతీస్‌ ఇంజనీరింగ్‌ కళాశా లలో ప్రిన్సిపాల్‌ డా.జె.బాలభాస్కరరావు అధ్యక్షతన సోమవారం ఇంజనీర్స్‌డే నిర్వహించారు. ఈసందర్భం గా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటాని కి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెకానికల్‌ ఇంజనీర్‌, గరివిడి ఫెర్రో ఎల్లాయీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏజీఎం ఆర్‌వీకే దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన్ని సన్మానించారు. ఏవో జి.అనీల్‌కుమార్‌, వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:50 PM