Empty Chairs కుర్చీలు ఖాళీ.. సిబ్బంది ఏరీ?
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:26 AM
Empty Chairs, Where Is the Staff? భూముల రీ సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు కీలక శాఖలకు చెందిన సిబ్బంది హాజరు కావడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
అదే బాటలో వీఆర్‌వోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు
పార్వతీపురం రూరల్, డిసెంబరు20(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు కీలక శాఖలకు చెందిన సిబ్బంది హాజరు కావడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో రీ సర్వే మూడో దశకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ శిక్షణలో చాలావరకు కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. వాస్తవంగా ఈ కార్యక్రమానికి 16 మంది సర్వేయర్లు హాజరుకావాల్సి ఉంది. జమదాల, అడ్డాపుశీల, నర్సిపురానికి చెందిన సర్వేయర్లు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు కనిపించలేదు. కొంతమంది వీఆర్వోలు కూడా గైర్హాజరయ్యారు. కొందరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా డుమ్మా కొట్టారు. బందలుప్పి, చిన్నబండపల్లి, డీకేపట్నం, గంగాపురం, పెదమరికి, నర్సిపురం ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే హాజరయ్యారు. ఈ విధంగా శిక్షణ కార్యక్రమాలకు డుమ్మా కొడితే ఏ విధంగా ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తారో ఆ శాఖల ఉన్నతాధికారులకే తెలియాలి. దీనిపై ఎంపీడీవో సత్యంను వివరణ కోరగా.. శిక్షణ కార్యక్రమానికి కొంతమంది గ్రామ సర్వేయర్లు, వీఆర్‌వోలు రాకపోవడం వాస్తవ మేనని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.